లేడీ హెడ్ కానిస్టేబుల్ ని మోసం చేసిన సిఐ.. కలెక్టరేట్ ముందు ఆందోళన..
ఆత్మకూరు సిఐ గుణ శేఖర్ బాబు మోసం చేశాడంటూ కోవెలకుంట్ల హెడ్ కానిస్టేబుల్ డి హుసేనమ్మ కర్నూల్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగింది.
ఆత్మకూరు సిఐ గుణ శేఖర్ బాబు మోసం చేశాడంటూ కోవెలకుంట్ల హెడ్ కానిస్టేబుల్ డి హుసేనమ్మ కర్నూల్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగింది. ఒంటరి గా ఉన్న తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనదగ్గర 70 వేలు డబ్బులు తీసుకున్నాడని ఆయన నుంచి తనకు ప్రాణహని ఉందని చెబుతోందామె. నకిలీ విడాకుల పత్రాలు చూపించి, తరచు నన్ను పెళ్లి చేసుకోవాలని వేదించేవాడని, ఇప్పుడు తనకు తన కొడుకుకు ఆయనతో ప్రాణహాని ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులు సీ.ఐపై, ఆయనకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కానిస్టేబుల్ డిమాండ్ చేస్తోంది.