Video : భయం గుప్పిట్లో చింతలాయిపల్లె గ్రామస్తులు...
కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లె గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంజుల సుబ్బారావు దారుణ హత్యతో కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లె గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంజుల సుబ్బారావు దారుణ హత్యతో కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసుల పహారా కొనసాగుతోంది. హత్యకు గురైన సుబ్బారావు ఇంటివద్ద, అనుమానితుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోయిలకుంట్ల సీఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసుల పికెటింగ్
కొనసాగుతోంది. హత్య కేసులో నిందితులను ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించామని సిఐ తెలిపారు.