లక్షలు దోచేసి పిల్లాడి శవాన్ని ఇవ్వడానికి....
గుంటూరు జిల్లా కొత్త పేట బ్లూసొమ్స్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా కొత్త పేట బ్లూసొమ్స్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మూడు నెలలుగా బాలుడికి మూడు నెలలుగా వైద్యులు చికిత్స చేశారు.సెప్టెంబర్ 19వ తేదీన బాలుడికి జన్మనిచ్చిన నాయుడుపాలెంకు చెందిన మౌనిక బిడ్డ ఉమ్మనీరు తాగాడని మెరుగైన వైద్యం కోసం బ్లూసొమ్స్ హాస్పిటల్ కు చిలకలూరిపేట వైద్యులు రిఫర్ చేశారు. మూడు నెలల నుంచి ఆస్పత్రి యాజమాన్యం 11 లక్షల నగదు వసూలు చేసింది. మరో మూడు లక్షలు కట్టాలని వైద్యుల సూచించారు. తాము ఇక కట్టలేమని తల్లిదండ్రులు చెప్పారు.నగదు లేకపోవడంతో బాలుడు మరణించాడని వైద్యులు చెప్పారు .మూడు లక్షలు కడితేనే మృత దేహం ఇస్తామని వైద్యులు అంటున్నారు.