సత్తెనపల్లికి జవాన్ మురళికృష్ణ మృతదేహం...పోలీసుల ఘన నివాళి
Apr 6, 2021, 1:22 PM IST
గుంటూరు: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళికృష్ణ మృతదేహం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడ జవాన్ పార్ధీవ దేహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పోలీసులు. ఇక్కడినుండి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామం గుడిపూడికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.