జనభేరి సభకు ముందు... కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
అమరావతి: రాజధాని కోసం అమరావతిలో ప్రారంభమైన ఉద్యమం ఏడాది పూర్తిచేసుకున్న సందర్బంగా రాయపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అమరావతి: రాజధాని కోసం అమరావతిలో ప్రారంభమైన ఉద్యమం ఏడాది పూర్తిచేసుకున్న సందర్బంగా రాయపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొనడానికి బయలుదేరే ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు దుర్గ గుడి ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలను అనుసరించి స్వాగతం పలికారు.