ఓటుకు వెయ్యి రూపాయలు... సీఎం జగన్ సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి..!
కడప :కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైసిపి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది.
కడప :కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైసిపి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలోని ప్రొద్దుటూరు పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.ఒక్కో ఓటుకు రూ.1000 చొప్పున బహిరంగంగానే పంపిణీ చేస్తున్నారని... పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చర్యలు శూన్యమని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తున్న వీడియోను టిడిపి నాయకులు బయటపెట్టారు.