పెనమలూరు వృద్దురాలి హత్య... బంగారం కోసం కేర్ టేకర్ దారుణం
విజయవాడ : పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్యకేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.
విజయవాడ : పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్యకేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. వృద్దురాలికి కేర్ టేకర్ గా పనిచేస్తున్న మహిళే హత్యకు పాల్పడి బంగారు నగలు దొంగిలించినట్లు తమ విచారణతో బయపడిందని డిఎస్పీ విజయపాల్ తెలిపారు. దొంగిలించిన సొమ్మును మృతురాలి ఇంట్లోనే దాచిపెట్టి ఎవరో ఎత్తుకెళ్లినట్లు నాటకమాడినా విషయం బయటపడటంతో సదరు కేర్ టేకర్ కటకటాలపాలయ్యింది.
కానూరు గ్రామానికి చెందిన చాగంటిపాటి సుమతిదేవి(81) వయసు మీదపడి అనారోగ్యంతో బాధపడుతుంటే బాగోగులు చూడటానికి చింతల మల్లేశ్వరి అనే మహిళను కేర్ టేకర్ పెట్టారు కొడుకులు. అయితే వృద్దురాలు ఒంటిపై నగలు, ఇంట్లోని నగదుపై కన్నేసిన మల్లేశ్వరి దారుణానికి ఒడిగట్టింది. వృద్దురాలిని అతి దారుణంగా హతమార్చి నాలుగు లక్షల విలువైన బంగారం ,4 వేల నగదును దోచుకుంది. తన నేరాన్ని కప్పిపుచ్చేందుకు నాటకమాడినా చివరకు పోలీసులకు చిక్కింది. దొంగిలించిన సొమ్ము ఇంట్లోనే దాచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.