మూడు రాజధానులపై స్టే.. హైకోర్టు కి రాజధాని మహిళల హారతులు..

3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది

First Published Aug 4, 2020, 5:36 PM IST | Last Updated Aug 4, 2020, 5:36 PM IST

3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రిప్లై కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీచేసింది. ఏపీలో 3 రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధించింది