AP Capital Issue : జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా..రాజధాని రైతుల ఆందోళన...
రాజధానిపై సీఎం వైఎస్ జగన్ ప్రకటనను రాజధాని రైతులు వ్యతిరేకించారు.
రాజధానిపై సీఎం వైఎస్ జగన్ ప్రకటనను రాజధాని రైతులు వ్యతిరేకించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో ఆందోళన చేపట్టారు. రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దని, పరిపాలన అమరావతి నుండే సాగించాలని కోరారు. మూడు ప్రాంతాల్లో రాజధాని వల్ల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దని అన్నారు.