చంద్రబాబు, పవన్ ఇప్పుడు కాదు ఎప్పుడో కలిసారు..: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
మచిలీపట్నం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై వైసిపి యువ నాయకుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మచిలీపట్నం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై వైసిపి యువ నాయకుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వారిద్దరూ ఒక్కటేనని తమకెప్పుడో అర్థమయ్యిందని... ఇప్పుడది మరోసారి బయటపడిందని అన్నారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసేవున్నారు... ఇప్పుడు ఖాళీగా వున్నారు కాబట్టి భేటీ అయ్యారన్నారు.
వాళ్ళు విడిపోతే ఏదయినా మాట్లాడతాం... కానీ కలిసుంటే ఏ మాట్లాడతామన్నారు. పవన్, చంద్రబాబు కలిసొచ్చినా, విడిపోయి వచ్చినా మాకేం కాదు... మళ్లీ 175 కి 175 సీట్లు కొట్టి తీరతామని అన్నారు. ఒక గ్రామానికి లేదంటే ఒక వార్డుకు జగన్, వైసిపి ప్రభుత్వం వివిధ పథకాల కింద ఖర్చుచేసిన డబ్బులకంటే వేరే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ ఖర్చుచేస్తే వాళ్లకే ఓటు వేయమని చెప్పాలంటూ సిద్దార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జడ్పీ సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన స్విమ్మింగ్ పూల్, జిమ్ ను సిద్దార్థ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు, ఆర్డీవో కిషోర్, ఎమ్మార్వో సునీల్ బాబు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.