శ్రీశైలం ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం...తస్మాత్ జాగ్రత్త..: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలనం

కర్నూల్ : ఉమ్మడి రాష్ట్రం నుండి విభజిత ఏపీ వరకు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోందని రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి అన్నారు. 

First Published Jan 4, 2023, 5:12 PM IST | Last Updated Jan 4, 2023, 5:12 PM IST

కర్నూల్ : ఉమ్మడి రాష్ట్రం నుండి విభజిత ఏపీ వరకు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోందని రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి అన్నారు. సాగు నీరే కాదు కనీసం తాగు నీటి విషయంలోనూ రాయలసీమ అన్యాయానికి గురయ్యిందన్నారు. అందుకే రాయలసీమ తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నెలలో (జనవరి 28న) నిర్వహించే ఛలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని... సీమ వాసులంతా ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్ట్  రక్షణ గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని బైరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. భారీ వర్షాలు కురిస్తే ఏదో ఒకరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ కూలిపోయే అవకాశాలున్నాయంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాంబ్ పేల్చారు.