Video:తలొకచోట..చేతులోచోట..శరీరం మరోచోట...శ్రీశైలంలో బస్సుప్రమాద దారుణం...

కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ వెనుక భాగంలో కూర్చున్న మహిళలు మృత్యువాత పడ్డారు. 

First Published Dec 5, 2019, 12:22 PM IST | Last Updated Dec 5, 2019, 12:26 PM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ వెనుక భాగంలో కూర్చున్న మహిళలు మృత్యువాత పడ్డారు. బస్సులు ఢీకొన్న ధాటికి ధర్మవరం బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడడంతో పరిస్థితి భయానకంగా మారింది.శ్రీశైలం నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.. అనంతపురం జిల్లా ధర్మవరం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘాట్ రోడ్డు మలుపుల వద్ద నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.