రోజూ నడిచే దారి పక్కనే మృతదేహం ఖననం.. భయాందోళనల్లో స్థానికులు..
తుళ్లూరు స్మశాన వాటిక వద్ద బాలయేసు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు.
తుళ్లూరు స్మశాన వాటిక వద్ద బాలయేసు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాలనీవాసులు అంటే చిన్న చూపు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి రహదారులు నిర్బంధించారు. కోవిడ్ వైరస్ తో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి రహస్యంగా పూడ్చి పెట్టడంపై ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు.