మదనపల్లి: గంటల్లో పెళ్ళి... కళ్యాణమండపం నుండే పెళ్ళికూతురు జంప్
చిత్తూరు: మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువతి కళ్యాణమండపం నుండే వేరే యువకుడితో జంప్ అయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.
చిత్తూరు: మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువతి కళ్యాణమండపం నుండే వేరే యువకుడితో జంప్ అయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా శనివారం అర్ధరాత్రి వధువు మండపం నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇదే సమయంలో యువతి కూడా ప్రేమించినవాడిని పెళ్లాడి అదే పోలీస్ స్టేషన్ కు చేరకుంది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. యువతి మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు సర్దిచెప్పారు.