ఆ ఆలయాలను పునర్మించాలంటూ... ప్రకాశం బ్యారేజిపై బిజెపి ధర్నా
విజయవాడ: పుష్కరాలు సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ధర్నాకు దిగింది.
విజయవాడ: పుష్కరాలు సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ధర్నాకు దిగింది. ప్రకాశం బ్యారేజి సమీపంలోని శనీశ్వర ఆలయం వద్ద బిజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించి సొమ్ముల వివరాలను వెల్లడించారు. వైసిపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరు చెప్పి అనేక ఆలయాలు పడగొట్టారని... ఆనాడు బిజెపి లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయాలు కట్టాలంటూ ఆందోళన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా దర్గాలను కడతామని ప్రకటించారంటూ మండిపడ్డారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాలపై నమ్మకం, గౌరవం లేదని...చంద్రబాబు కూడా పడగొట్టిన ఆలయాలపై మాట్లాడాలన్నారు.