దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ పై భారీగా తగ్గింపు... ఏపీలో మాత్రం ఇదీ పరిస్థితి: ఎంపీ జివిఎల్ సీరియస్
అమరావతి: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై తన పన్నులను తగ్గించుకోవడంతో వాటి ధరలు దిగివచ్చాయి
అమరావతి: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై తన పన్నులను తగ్గించుకోవడంతో వాటి ధరలు దిగివచ్చాయి. దేశంలో పెట్రోల్ ధర తొమ్మిది రూపాయలు, డీజిల్ పై ఎనిమిది రూపాయలకు పైగా తగ్గడంపై బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ఆనందం వ్యక్తం చేసారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించి దేశ ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. ఆరునెలలు తిరగకుండానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం ఇది రెండోసారి అన్నారు. కేంద్రం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను మరింత తగ్గించాలని కోరారు. పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తగ్గించి రాష్ట్ర ప్రజలపై భారం తగ్గించేవరకు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించుకోకుంటే ప్రజాగ్రహానికి సిద్దం కావాలని జివిఎల్ హెచ్చరించారు.