సభల నిర్వహణ రాజకీయ పార్టీ హక్కు... నిషేదం సరికాదు : బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి

అనంతపురం : ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

First Published Jan 3, 2023, 11:30 AM IST | Last Updated Jan 3, 2023, 11:30 AM IST

అనంతపురం : ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో వైసిపి ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల సభల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి 
 ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనల పేరుతో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనగా వైసిపి ప్రభుత్వం వుందా అన్న అనుమానం కలుగుతోందని... దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ డిమాండ్ చేసారు. 

చంద్రబాబు నాయుడు సభలో ప్రజలు చనిపోయారు కాబట్టి నిర్వహకులు లేదా తెలుగుదేశం పార్టీ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు లేదా ఆ సభలకు అనుమతి తీసుకున్నవారిపైనా చర్యలు తీసుకోవచ్చని విష్ణువర్ధన్ సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలి... నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. కానీ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇతర సభలు పూర్తిగా జరపకూడదనే నిబంధన సరయినది కాదన్నారు. ఇప్పటిలాగే సభలకు అనుమతి కోరినప్పుడు ప్రభుత్వం, పోలీసులు మార్గదర్శకాలు జారీచేయాలని... వాటికి అనుగుణంగా సభలు నిర్వహించుకుంటామని విష్ణువర్ధన్ తెలిపారు.