Asianet News TeluguAsianet News Telugu

బెలుం గుహలు : రేపటి నుండే పర్యాటక ఉత్సవాలు..కోటి 50 లక్షలతో ఏర్పాట్లు

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహల్లో ఈ నెల 8, 9 తేదీల్లో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహల్లో ఈ నెల 8, 9 తేదీల్లో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బెలుం గుహల విశిష్టతలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న సంకల్పంతో పర్యాటక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వీటి నిర్వహణ ఏర్పాట్లపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 18 శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.