కరోనాను జయించిన కానిస్టేబుల్.. పూలవర్షంతో స్వాగతం...
కరోనాపాజిటివ్ నుండి కోలుకుని విధుల్లోకి చేరుతున్న కానిస్టేబుల్ పి. శివ కృష్ణకు బాపట్ల పోలీసులు ఘన స్వాగతం పలికారు.
కరోనాపాజిటివ్ నుండి కోలుకుని విధుల్లోకి చేరుతున్న కానిస్టేబుల్ పి. శివ కృష్ణకు బాపట్ల పోలీసులు ఘన స్వాగతం పలికారు. బాపట్ల టౌన్ సీఐ బి.అశోక్ కుమార్, ఎస్ఐ హాజరతయ్య నేతృత్వంలో పోలీసు సిబ్బంది పుష్ప గుచ్ఛం ఇచ్చి స్టేషన్ లోకి ఆహ్వానించారు. సిబ్బందిలో మనో ధైర్యాన్ని నింపటానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల హైదరాబాద్‌లో మాజీ సీఎం చంద్రబాబు భద్రత డ్యూటీలో ఉన్నప్పుడే అనారోగ్యానికి గురవ్వడంతో.. కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వ్యాధిపై పోరాడి గెలిచి..తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు.