వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన బీటెక్ రవి.. రాజీనామా చేయాలని డిమాండ్..
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ mlc బిటెక్.రవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ mlc బిటెక్.రవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్యెల్యేలు రాజీనామా చెయ్యాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి భయపడి, రాజీనామా చెయ్యలేకపోతున్నారా అని ఎద్దేవా చేశారు. చట్టంలో జ్యుడీషియల్ రాజధాని అనే ప్రసక్తే లేదన్నారు. అమరావతి రైతులు దీక్షా ప్రాంతానికి చేరుకుని వారికి సంఘీభావంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టో ని బైబిల్,ఖురాన్ తో పోల్చే జగన్మోహన్ రెడ్డి ,అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అయితే...మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలవండి ,నేను శాశ్వతంగా రాజకీయలనుండి తప్పుకుంటా అని సవాల్ చేశారు