సత్యసాయి జిల్లాలో అమానుషం... ప్రియుడి తోటలో ఫార్మసి విద్యార్థిని మృతదేహం... గ్యాంగ్ రేప్ జరిగిందా?
గోరంట్ల: బీ ఫార్మసి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ ఓ షెడ్ లో యువతి ఉరేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు యువతి మృతదేహంతో బాధిత కుటుంబం, మహిళా సంఘాల ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.