జాతీయ విద్యావిధానంపై అవగాహనా సదస్సు...మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు
అమరావతి: జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ అవగాహనా సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ అవగాహనా సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సచివాలయంలోని 5 వ బ్లాక్ లో రెండో రోజు సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్ రంగనాధరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.