వైఎస్సార్ విగ్రహం ధ్వంసం... టిడిపి నేతను తరలిస్తున్న అంబులెన్స్ పై వైసిపి రాళ్లదాడి

నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో మాజీ సీఎం, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం వివాదానికి దారితీసింది. 

First Published Jan 16, 2022, 11:28 AM IST | Last Updated Jan 16, 2022, 11:28 AM IST

నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో మాజీ సీఎం, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం వివాదానికి దారితీసింది. టీడీపీ కార్యకర్తలు అనిల్, రాజేష్ ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ చదలవాడ అరవింద్ బాబు ఆందోళనకు దిగగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో టిడిపి, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా చదలవాడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను హాస్పిటల్ కు తరలిస్తుండగా అంబులెన్స్ పై వైసిపి మూకలు రాళ్లదాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.