అస్లాం మృతిపై మంత్రి వెల్లంపల్లిని నిలదీస్తూ... విజయవాడలో ముస్లీం సంఘాలు నిరసన

విజయవాడ: ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందిన అస్లాం విషయంలో ఇప్పటివరకు స్పందించని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాలిక ఆత్మహత్య ఘటనలో మాత్రం తక్షణమే స్పందించడంలో ఆంతర్యం ఏమిటని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. 

First Published Jan 31, 2022, 5:42 PM IST | Last Updated Jan 31, 2022, 5:42 PM IST

విజయవాడ: ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందిన అస్లాం విషయంలో ఇప్పటివరకు స్పందించని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాలిక ఆత్మహత్య ఘటనలో మాత్రం తక్షణమే స్పందించడంలో ఆంతర్యం ఏమిటని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. ముస్లిం మైనార్టీలు అంటే ఎందుకంత చులకనభావం అని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు.అస్లాం మృతికి కారకులైన దోషులను శిక్షించాలని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా ముస్లిం సంఘాలు ఏకమయ్యాయి. పోస్టుమార్టం నివేదికను కూడా మార్చే ప్రయత్నంలో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారని వారు ఆరోపించారు. సోమవారం విజయవాడలో లో ముస్లిం మైనారిటీ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు.