''రేపల్లే రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్... ఎస్పీకి సీఎం జగన్ కీలక ఆదేశాలు''

బాపట్ల: ప్రకాశం జిల్లా  నుండి పొట్టచేతబట్టుకుని వచ్చిన మహిళపై కట్టుకున్న భర్త, కన్నబిడ్డల కళ్లముందే కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా రేపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి స్పదించారు. ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి నిందితులను అదపులోకి తీసుకున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. రైల్వే స్టేషన్లలో భద్రతా లోపంపై  రైల్వే శాఖ అధికారులను వివరణ కోరినట్లు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. తమకు పూర్తిస్థాయి నివేదిక అందించాలని కోరామన్నారు. ఈ ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నామని... ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. 

First Published May 1, 2022, 3:56 PM IST | Last Updated May 1, 2022, 3:56 PM IST