Asianet News TeluguAsianet News Telugu

నిధులివ్వకుంటే మాకిక ఉరితాడే దిక్కు ...: ఏపీ సర్పంచుల ఆందోళన

తాడేపల్లి : సొంత డబ్బులతో గ్రామాల అభివృద్ది పనులు చేపడితే బిల్లులు చెల్లించడంతో ప్రభుత్వం ఆలస్యం చేస్తొందని ఆరోపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సర్పంచ్ లు ఆందోళనకు దిగారు. 

తాడేపల్లి : సొంత డబ్బులతో గ్రామాల అభివృద్ది పనులు చేపడితే బిల్లులు చెల్లించడంతో ప్రభుత్వం ఆలస్యం చేస్తొందని ఆరోపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సర్పంచ్ లు ఆందోళనకు దిగారు. 15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే చెల్లించాలని... గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఏపీ సర్పంచుల సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.  తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడికి సర్పంచులు సిద్దమయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కమీషనర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. అలాగే సర్పంచులు తలపెట్టిన నిరసనకు ఎలాంటి అనుమతి లేదని... పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా భారీగా చేరుకున్న సర్పంచులు పంచాయితీ రాజ్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. నిధులు విడుదల చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. 

Video Top Stories