AP PRC Issue: జగన్ సర్కార్ కు ఉద్యోగుల షాక్... చర్యలకు పిలిచిన సచివాలయంలోనే ఆందోళన

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలను ఉదృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పిఆర్సి జీవోలను రద్దు చేయాలంటూ నినదిస్తూ సచివాలయ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.  పీఆర్సీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీతో సమావేశాన్ని కూడా ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అశుతోష్ మిశ్రా కమిషన్ పీఆర్సీ రిపోర్ట్ ను బహిర్గతం చేసి చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 

First Published Jan 25, 2022, 3:26 PM IST | Last Updated Jan 25, 2022, 3:26 PM IST