జగన్ సర్కార్ ముందు మూడు డిమాండ్లు... అప్పుడే చర్చలు..: ఉద్యోగ సంఘాల క్లారిటీ
అమరావతి: పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకుంటేనే మంత్రుల కమిటీతో చర్చలకు సిద్దమన్న ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ఓ మెట్టు దిగింది.
అమరావతి: పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకుంటేనే మంత్రుల కమిటీతో చర్చలకు సిద్దమన్న ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ఓ మెట్టు దిగింది. తాజాగా సచివాలయానికి చేరుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రులతో చర్చలు జరపకున్నా 3 కీలక అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. పీఆర్సీ పై గతంలో ఏర్పాటుచేసిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలను బయటపెట్టాలని.. పీఆర్సీ జీవోలను అమలు చేయవద్దని... జనవరి నెల పాత పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించాలని లేఖలో కోరారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే చర్చలకు సిద్ధమని లేఖలో తెలిపారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు.