AP PRC Issue:కదంతొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు... విజయవాడలో భారీ ఆందోళనలు
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. పీఆర్సీ జీవోల రద్దుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. విజయవాడ పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించాలని ఉద్యోగులు కోరారు. ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులపై ప్రభుత్వమే దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కేవలం తమ పనికి తగిన వేతనాన్నే తాము కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో అంతర్భాగమేననే విషయాన్ని పాలకులు గుర్తించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు.