సీఎం జగన్ అసలు డిగ్రీ పాసయ్యారా?: టిడిపి నాయకుల సెటైర్లు
కర్నూల్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ గా నమోదు చేసుకోకపోవడం ఆయన విద్యార్హతలపైనే అనుమానాలు రేకిత్తిస్తోందని టిడిపి నాయకులు అంటున్నారు.
కర్నూల్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ గా నమోదు చేసుకోకపోవడం ఆయన విద్యార్హతలపైనే అనుమానాలు రేకిత్తిస్తోందని టిడిపి నాయకులు అంటున్నారు. పశ్చిమ రాయలసీమ పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసిందని... దీంతో ఉమ్మడి కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలో జోరుగా ఓటర్ల నమోదు సాగుతోందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. మరి బాధ్యతాయుతమైన సీఎం పదవిలో వున్న వ్యక్తి, ఈ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపుతున్న వైసిపి అధ్యక్షుడు జగన్ మాత్రం ఓటర్ గా నమోదు చేసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు జగన్ డిగ్రీ చదివారా? డిగ్రీ పాసయ్యారా? అసలాయన గ్రాడ్యుయేట్ కాదేమో అన్నా అనుమానాలు కలుగుతున్నాయని... ఓటు నమోదు చేసుకోని ఆయనకు, ఆయన పార్టీ నాయకులకు ఓటు అడిగే అర్హత ఉందా? అని కర్నూల్ టిడిపి నాయకులు ప్రశ్నించారు.