టెన్త్ కూడా చదవకుండానే గ్రాడ్యుయేట్... ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల లీలలివీ..!

తిరుపతి :పదో తరగతి కూడా చదవని ఓ మహిళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నించిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది.

First Published Mar 13, 2023, 1:31 PM IST | Last Updated Mar 13, 2023, 1:31 PM IST

తిరుపతి :పదో తరగతి కూడా చదవని ఓ మహిళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నించిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తిరుపతిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. పోలింగ్ కేంద్రంలో ఓ మహిళ ఓటేసేందుకు రాగా అనుమానం వచ్చి ప్రశ్నించగా పదో తరగతి మాత్రమే చదివినట్లు స్వయంగా ఆమే చెప్పింది. తాను తమిళనాడు వాసినని... వాలంటీర్ ఓటర్ స్లిప్పు ఇచ్చి ఓటేయాలని పంపారని సదరు మహిళ తెలిపింది. అసలు ఇవి ఏ ఎన్నికలో కూడా తనకు తెలియదని సదరు మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

అధికార అండతో  వైసిపి నాయకులు దొంగఓట్లు వేయిస్తున్నారని... స్వయంగా వైసిపి కార్యకర్తలు దొంగ ఓటర్లను పోలింగ్ బూత్ లోకి తీసుకుని వెళుతున్నారని తిరుపతి టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అడ్డుకోడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకోగా టిడిపి నాయకులనే పోలీసులు అరెస్ట్ చేసారని నాయకులు వాపోతున్నారు. పోలింగ్ ఏజంట్ గా వ్యవహరిస్తున్న తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.