దాచేపల్లి: నామినేషన్ల పరిశీలనలో గందరగోళం... ఆందోళనకు దిగిన జనసేన నాయకులు

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాచేపల్లిలోని 10వ వార్డులో ఆరు నామినేషన్లు దాఖలవగా వాటిలో ఐదింటిని ఎంపిడివో మహాలక్ష్మీ  తిరస్కరించారు. దీంతో డిక్లరేషన్ ఫామ్  జనసేన నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేసారు. అయితే అక్కడే  విధుల్లో వున్న ఎస్సై సుధీర్ కుమార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ  MPDO డిక్లరేషన్ ఇవ్వదంటూ జనసేన కార్యకర్తలను బయటకు పంపించారు. ఎంపిడివో, ఎస్సై ప్రవర్తించిన తీరుకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు జనసేన కార్యకర్తలు. 
 
First Published Nov 7, 2021, 2:53 PM IST | Last Updated Nov 7, 2021, 2:53 PM IST