video news : పవన్ ఎప్పటిలాగే అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ కళ్యాణ్ అనడం సరికాదని... కేవలం రెండు దెబ్బలు వేస్తే నేరాలుకంట్రోల్ అవుతాయా...? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అత్యంత కిరాతకంగా జరిగిన దిశ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పవన్ ఎప్పటిలాగే అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు... ఇప్పటికైనా కొంచెం బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురాడానికి ప్రయత్నిస్తోందన్నారు.