స్విమ్స్ లో ఆళ్లనాని ఆకస్మిక పర్యటన.. పీపీఈ కిట్లు వేసుకుని కరోనా వార్డులోకి...
చిత్తూరు జిల్లా తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
చిత్తూరు జిల్లా తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా పిపిఈ కిట్టు ధరించి కరోనా రోగుల వార్డ్ ను పరిశీలించారు. కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలమీద ఆరా తీశారు. భోజనం, మచినీరు, శానిటేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహారం బాగాలేదన్న రోగుల ఫిర్యాదు మేరకు వెంటనే మెనూలో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆళ్ల నాని వెంట mla కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.