మూడు రాజధానుల బిల్లుపై జగన్ సర్కార్ వెనక్కి... తుళ్లూరు దీక్షాశిబిరంవద్ద సంబరాలు
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద కోలాహలం నెలకొంది.
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద కోలాహలం నెలకొంది. జగన్ సర్కార్ తాజా నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళలు మిఠాయిలు పంచుకున్నారు. సీఎం జగన్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని... ఇప్పటికైనా రాజకీయలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతున్నామన్నారు.