అమూల్‌తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. ఇది చారిత్రాత్మక అడుగు..
ఏపీలో జగన్ సర్కార్ అమూల్‌తో కీలక అవగాహనా ఒప్పందం చేసుకుంది.
ఏపీలో జగన్ సర్కార్ అమూల్‌తో కీలక అవగాహనా ఒప్పందం చేసుకుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఎంఓయూపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య.. అమూల్ చెన్నై జోనల్‌హెడ్ రాజన్ సంతకాలు చేశారు. అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏపీకి, అమూల్‌కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు అన్నారు సీఎం జగన్. గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారన్నారు జగన్. లీటరు పాలు, లీటరు మినరల్ వాటర్ బాటిల్ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో తనకు రైతులు చూపించారని గుర్తు చేశారు. లీటరు మినరల్ వాటర్ రూ.22కి లభిస్తే.. పాలు కూడా అంతే ధరకు లభిస్తున్నాయన్నారు. అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నామని.. రైతులకు, సహకార రంగానికి మేలు జరగాలని ఆరాటపడుతున్నామన్నారు.