Asianet News TeluguAsianet News Telugu

ఆ మహిళలకు శుభవార్త.. ప్రారంభమైన వైఎస్సార్ కాపు నేస్తం..

కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ప్రజల కోసం వినూత్న పథకాలను అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. 

కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ప్రజల కోసం వినూత్న పథకాలను అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. తాజాగా మహిళల కోసం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ను తీసుకొచ్చింది. క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా మాట్లాడారు. ఏడాది కాలంలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాల వంటి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేశామన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల ఆర్థిక సాయం చేస్తున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తున్నామన్నారు.