జగన్, చంద్రబాబు చేసిందేమీ లేదు... ఆంధ్రా హక్కులకోసం కేసీఆర్ పోరాటం : ఏపి బిఆర్ఎస్ నేత

విజయవాడ : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ఏపీ ప్రజలు భారీగా తరలిరావాలని చింత పార్థసారథి పిలుపునిచ్చారు.

First Published Jan 17, 2023, 2:24 PM IST | Last Updated Jan 17, 2023, 2:24 PM IST

విజయవాడ : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ఏపీ ప్రజలు భారీగా తరలిరావాలని చింత పార్థసారథి పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రేపు ఖమ్మంలో బిఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభ గురించి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలంతా కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని... ఖమ్మం సభను జయప్రదం చేయాలని పార్థసారథి సూచించారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్ ఎప్పుడూ దూషించలేదని... ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్థసారథి అన్నారు. రైతే రాజు నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న బి.ఆర్.ఎస్, కేసీఆర్ ను అండగా నిలవాలన్నారు. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీ అభివృద్దిని నిర్లక్ష్యం చేసారని... కానీ కేసీఆర్ జాతీయ నేతగా ఏపీ హక్కుల కోసం కృషిచేస్తున్నారని పార్థసారథి పేర్కొన్నారు.