అధికారమే పరమావధిగా జీవితాలతో చెలగాటం...: గుంటూరు తొక్కిసలాటపై సోము వీర్రాజు
గుంటూరు : ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సభల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు.
గుంటూరు : ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సభల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. పాలకులు, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఆలోచిస్తూ చేపట్టిన ఇలాంటి చర్యలు పేదప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు బిజెపి భావిస్తోందన్నారు. అమాయకమైన ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదని... కందుకూరు ఘటన మరువకముందే ఈ ఘటన జరగడం నిర్వహకుల వైఫల్యమేనని అన్నారు. గుంటూరు దుర్ఘటన చాలా దురదృష్టకరమని... మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని... కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరక్కుండా జాగ్రత్తపడాలని సోము వీర్రాజు కోరారు.