AP Assembly : పూటకో పంచాయితీ...రోజుకో నిరసన...
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు పూటకో పంచాయితీ, రోజుకో నిరసనలా సాగుతున్నాయి.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు పూటకో పంచాయితీ, రోజుకో నిరసనలా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజునుండి టీడీపీ ప్రతీరోజూ ఏదో ఒక ఇష్యూని తీసుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఉపాధి హామీ పథకం నిధులు, నరేగా పథకాలు, ఇసుకకొరత... ఉల్లిధరలు, పంటలకు గిట్టుబాటు ధరలు..రివర్స్ పాలన..ఇలా రకరకాల సమస్యల మీద నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆపాలంటూ నిరసన తెలిపారు.