ఏపీ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా... భార్యకు కూడా పాజిటివ్..
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. కోన రఘుపతి భార్యకి కూడా కరోనా సోకింది. మైల్డ్ గా వచ్చిందని ఎవ్వరూ కంగారు పడొద్దని వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారన్టైన్ లో ఉంటున్నామని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని తెలిపారు