విశాఖ జిల్లాలో మాతాశ్రీ కో ఆపేరేటివ్ సొసైటీ పేరుతో ఘరానా మోసం
విశాఖ జిల్లా పాయకరావుపేటలో మాతాశ్రీ కో ఆపేరేటివ్ సొసైటీ అను పేరుతో ఘరానా మోసం బయటపడింది.
విశాఖ జిల్లా పాయకరావుపేట లో మాతాశ్రీ కో ఆపేరేటివ్ సొసైటీ అను పేరుతో ఘరానా మోసం బయటపడింది. వసూళ్లే ప్రధాన అజెండాగా పెట్టుకున్న ఓ సంస్ధ ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసింది. గృహోపకరణాలు, ఉద్యోగాలు, ఇంట్రెస్ట్ లు,పప్పుల చీటీలు పేరిట జనాన్ని నమ్మించి ఏకంగా సుమారు రెండు కోట్లతో ఉడాయించిందీ . దీంతో తాము దాచుకున్న సొమ్మును,ఇతరులతో కట్టించిన సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ ఆందోళనకు దిగారు బాధితులు.