Video news: 11వ పి.ఆర్.సి వెంటనే అమలు చేయాలంటూ...
నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ.పీ.జె.ఎ.సి పిలుపు మేరకు ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు.
నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ.పీ.జె.ఎ.సి పిలుపు మేరకు ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 11 వ పి.ఆర్.సి వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా బకాయి ఉన్న మూడు విడతల డి.ఏ లను విడుదల చేయాలని, సి.పీ.ఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.