నేను క్షేమంగానే వున్నా: అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థిని జయలక్ష్మి (వీడియో)
అనంతపురం: వైసిపి ప్రభుత్వం ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసుకోవాలన్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అనంతపురం: వైసిపి ప్రభుత్వం ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసుకోవాలన్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల రంగప్రవేశంతో కాలేజీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇలా గాయపడిన విద్యార్థిణి జయలక్ష్మి సోమవారం రాత్రి నుండి కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది.
అయితే తాను సురక్షితంగానే బందువుల ఇంట్లో క్షేమంగానే వున్నట్లు తాజాగా జయలక్ష్మి మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. తనకు అధికంగా ఫోన్ కాల్స్ రావడంతో, ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడంతో అందుబాటులోకి రాలేకపోయానని జయలక్ష్మి తెలిపారు.