Asianet News TeluguAsianet News Telugu

అమానుషం... కరోనా సోకిన వృద్దురాలిని హాస్పిటల్ బయట వర్షంలో వదిలేసి

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధపడుతున్న ఓ వృద్దురాలి పట్ల అంబులెన్స్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. 

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధపడుతున్న ఓ వృద్దురాలి పట్ల అంబులెన్స్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. నడవలేని పరిస్థితిలో వున్న వృద్ధురాలిని హాస్పిటల్ లోకి తీసుకెళ్లి అడ్మిట్ చేయకుండా బయటే పడేసి వెళ్లిపోయారు. అప్పటికే భారీ వర్షం కురుస్తుండటంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో వృద్దురాలు తడుస్తూ అక్కడే వుంది. చివరకు ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని వృద్దురాలిని హాస్పిటల్ లోపటికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోసపాడు మండలం నెహ్రు నగర్ కు చెందిన కొండమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి కరోన పాజిటివ్ నిర్ధారణఅయ్యింది. దీంతో ఆమెను అంబులెన్స్ లో కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ఆడ్మిషన్ చేయకుండానే వృద్దురాలిని నేలపై పడేసి వెళ్లిపోయారు అంబులెన్స్ సిబ్బంది. బంధువులకు సమాచారం రావడంతో ఆసుపత్రికి వచ్చి చూసే సరికి వర్షంలో నేలపై అనాథలా పడివుంది. దీంతో వారు స్ట్రేచర్ తెచ్చి కొండమ్మ సుశ్రుత భవన్ లోకి తీసుకెళ్లి కాలీగా వున్న ఓ బెడ్ పై పడుకోబెట్టారు. వృద్దురాలి పట్ల అమానుషంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Video Top Stories