చంద్రబాబు హయాంలో ఎక్కడ దాక్కున్నావ్ పవన్...: మంత్రి అంబటి కౌంటర్
గుంటూరు : కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆమరణ దీక్ష...
గుంటూరు : కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆమరణ దీక్ష... దాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విరమింపజేయడం తదితర వ్యవహారాలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు వాగ్దానం చేసి మరిస్తే... ముద్రగడ పద్మనాభం ఉద్యమించారని మంత్రి గుర్తుచేసారు. ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసి కాపులపై కేసులు పెట్టి వేధించిందని... ఆ రోజు పవన్ కల్యాణ్ మాట్లాడేందుకు కూడా ముందుకురాలేదని ప్రశ్నించారు. ఆనాడు ఈయన ఎక్కడ దాక్కున్నారో తెలీదు కానీ ఇప్పుడు జగన్ పాలనలో హరిరామ జోగయ్య నిరాహార దీక్షకు దిగితే మద్దతు ప్రకటించారు... ఇదెక్కడి లాజిక్, ఇదేక్కడి తర్కమో కాపు సోదరులు ఆలోచించాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.