న్యాయదేవత విగ్రహం, ప్రధాని మోదీ చిత్రపటానికి అమరావతి మహిళల పాలాభిషేకం
గుంటూరు: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
గుంటూరు: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జగన్ సర్కార్ కు గట్టి షాకిస్తూ సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై రాజధాని రైతుల, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా ఇటీవల ఏపీ రాజధానిగా అమరావతినే గుర్తిస్తూ ఆ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఇలా అమరాతిగా మద్దతుగా తీర్పునిచ్చిన న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మహిళలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు దీక్షాశిబిరం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న రైతులు,మహిళలు న్యాయ దేవత విగ్రహం, ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.