జగన్ సర్కార్ పై ఇక పోరాటమే... 26న భవిష్యత్ కార్యాచరణ : బొప్పరాజు హెచ్చరిక

 అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. 

First Published Feb 17, 2023, 4:45 PM IST | Last Updated Feb 17, 2023, 4:45 PM IST

 అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం వైఎస్ జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులను హింస పెట్టడం ఎంతవరకూ సమంజసమని అడిగారు. సంక్రాంతి కల్లా బకాయిలు ఇస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని...సీపీఎస్ వాటా డబ్బులు 11 నెలలుగా ప్రభుత్వం వాడేసుకుందన్నారు. జీతాలు మాకు భిక్ష వేస్తున్నారా? అని ప్రశ్నించారు. 12 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలేదు... సిగ్గు పడాలి అన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు పోరాటం తప్పదపి... ఈ నెల 26న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు హెచ్చరించారు.