గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ... హై సెక్యూరిటీ జోన్‌గా విశాఖపట్నం
విశాఖపట్నం :గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కోసం విశాఖపట్నం సిద్దమయ్యింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసారు.
విశాఖపట్నం :గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కోసం విశాఖపట్నం సిద్దమయ్యింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తవడంతో సమ్మిట్ జరిగే ఏయూ మైదానాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.భారీగా రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొంటుండటంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో డాగ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు సాగుతున్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ దగ్గరుండి ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.