బాలిక మృతితో పొన్నూరులో ఉద్రిక్తత... హాస్పిటల్ పై దాడి... ఫర్నిచర్, కారు ధ్వంసం

గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ బాలిక మృతి ఉద్రిక్తతకు దారితీసింది.

First Published Feb 12, 2023, 9:35 AM IST | Last Updated Feb 12, 2023, 9:35 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ బాలిక మృతి ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చేరిన బాలిక మృతిచెందింది. దీంతో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యమే బాలిక మృతికి కారణమని... సరయిన చికిత్స అందించకపోవడం వల్లే చనిపోయిందంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఫర్నిచర్ తో పాటు ఓ కారును బాలిక బంధువులు ధ్వంసం చేసారు. 

హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు దిగిన బాలిక బంధువులకు నచ్చజెప్పి హాస్పిటల్ పై దాడులు జరక్కుండా అడ్డుకున్నారు. హాస్పిటల్ వద్ద గుమిగూడిన వారిని అక్కడినుండి పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.